సినిమా ఇండస్ట్రీలో  ఏ దర్శకుడు అయినా మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నట్లు అయితే ఆ దర్శకుడికి వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతూ ఉంటాయి.  స్టార్ హీరోలు సైతం ఆ దర్శకులతో సినిమా చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు.  అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఒక దర్శకుడికి మాత్రం మొదటి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి సంవత్సరకాలం గడిచిపోతున్న ఇప్పటి వరకు తన తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ను విడుదల చేయలేదు.  టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి   ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా ఉప్పెన తోనే అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న బుచ్చిబాబు సన తన మొదటి సినిమా వచ్చి సంవత్సర కాలం దాటిపోతున్నా ఇప్పటికీ ఇప్పటి వరకు తన తదుపరి సినిమాకు సంబంధించిన అప్డేట్ ను ఈ దర్శకుడు ప్రకటించ లేకపోయాడు.

ఉప్పెన సినిమా తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సన  ,  జూనియర్ ఎన్టీఆర్ తో  హీరో గా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమాను తెరకెక్కించబోతున్నడు అని అనేక వార్తలు బయటకు వచ్చాయి, కానీ బుచ్చిబాబు సన , జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూవీ కి సంబంధించి ఎలాంటి అఫీషియల్ ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం బుచ్చిబాబు సన , పంజా వైష్ణవ్ తేజ్ తో మరో సినిమాను తెరకెక్కించబోతున్నాడు అని కూడా వార్తలు వచ్చాయి కానీ ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వెలువడలేదు, ఇలా మొదటి సినిమా వచ్చి సంవత్సర కాలం దాటిపోతున్న కానీ బుచ్చిబాబు సన తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: