కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు ఆయన తలపతి విజయ్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ తాజాగా బీస్ట్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

తమిళ క్రేజీ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఉగ్రవాదం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు. ఒక మాల్ ని ఉగ్రవాదులు హైజాక్ చేసిన సమయంలో అనుకోకుండా హీరో కూడా ఆ మాల్ లో ఉండటం,  ఉగ్రవాదులను హీరో ఎలా ఎదుర్కొన్నాడు. ఉగ్రవాదుల నుండి సామాన్య జనాల ప్రాణాలను ఎలా కాపాడాడు అనే కథాంశంతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు.  విడుదలకు ముందే మంచి అంచనాలు కలిగి వున్న ఈ సినిమా విడుదల తర్వాత మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. తమిళ్ లో పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్ లను తెచ్చుకున్న ఈ సినిమా ఇతర భాషలలో మాత్రం అంత ఆశాజనకమైన కలెక్షన్ లను మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టలేకపోయింది.

ఇది ఇలా ఉంటే ఇలా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయినా బీస్ట్ మూవీ కి సీక్వల్ ను తెరకెక్కించే ఆలోచనలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ 'బీస్ట్' మూవీ కి సీక్వల్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బీస్ట్ మూవీ లో దళపతి విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా,  ఈ మూవీ కి  యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: