ఈ రోజు థియేటర్ లో విడుదలైన చిన్న సినిమా గాడ్సే. సినిమా పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆనాడు భారత జాతిపిత అయిన మహాత్మ గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా తయారు చేసుకున్న ఒక సబ్జెక్టు గాడ్సే. అక్కడ గాంధీ పాలిట నాథూరామ్ గాడ్సే విలన్ గ అమరి తనను చంపాడు. అయితే ఈ సినిమాలో ఏమి మాత్రం ప్రస్తుతం ఉన్న పొలిటికల్ వ్యవస్థకు ఈ గాడ్సే విలన్ గా మారాడా లేదా అన్నది సినిమా చూసిన వాళ్ళు చెప్పాల్సి ఉంది. ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ రిలీజ్ అయిన రోజు నుండి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. పెద్దగా కాకపోయినా ఆ యంగ్ హీరోకు ఉన్నంత మార్కెట్ లో సక్సెస్ అవుతుందని చిత్ర బృందం అనుకుంది.

ఇందులో సత్యదేవ్ హీరోగా నటించగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా చేసింది... ఇక సత్యదేవ్ తో గతంలో బ్లఫ్ మాస్టర్ లాంటి సమాజానికి ఉపయోగపడే సినిమా తీసిన గోపి గణేష్ ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఈ సినిమా కూడా సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే మూవీ అని ప్రమోషన్స్ లో చెప్పడం జరిగింది. ఇందులో డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ కొట్టగానే ఉంది.. అంటే ఇంతకు ముందు ఎందరో ఈ పాయింట్ ను డీల్ చేసి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థను ప్రశ్నించే సినిమాగా గాడ్సే ను రూపొందించాడు. సినిమా మాత్రం ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసేలా ఉందని ఇప్పటికే వచ్చిన రివ్యూ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమా ప్రతి ఒక్క రాజకీయనాయకుడికి ఒక చురకలా ఉంటుందని చెబుతున్నారు.

సినిమా గురించి యావరేజ్ టాక్ వినిపిస్తున్నా, గాడ్సే పాత్రలో సత్యదేవ్ అన్నీ తానై నడిపించాడట. శంకర్ తెరకెక్కించిన జంటిల్మన్, భారతీయుడు లాంటి సినిమాలు గుర్తుకు వచ్చేలా ఈ సినిమాను గోపి గణేష్ తెరకెక్కించాడట. మరి ఈ సినిమా ఎంతమేరకు నేటి ప్రజలను ఆకట్టుకుంటుంది అనేది తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.      

మరింత సమాచారం తెలుసుకోండి: