టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లోనే టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన అనుష్క గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయశాంతి తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమా తర్వాత అనుష్క ప్యాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది . ఇక ప్రభాస్ కి తగ్గ జోడీగా బాహుబలి 2 సినిమాలో మంచి క్రేజ్ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా తనకు ఫాలోయింగ్ కూడా రెట్టింపు అయిందని చెప్పవచ్చు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది అనుష్క శెట్టి.

ఇకపోతే తాజాగా అనుష్క దగ్గర ఉన్న  కార్ ల వివరాలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి .వాటి గురించి మనం ఇప్పుడు ఒకసారి పూర్తిగా చదివి తెలుసుకుందాం..

1. టయోటా కరోలా ఆల్టిస్:
అనుష్క శెట్టి మొదటిసారి సొంతం చేసుకున్న కారు ఇదే కావడం గమనార్హం. అయితే ఇది పెట్రోల్ వేరియంట్ రూ.16.46 లక్షల నుండి రూ.20.20 లక్షల మధ్య ఉంటుంది. అదే డీజిల్ తో నడిచే కారు అయితే.. రూ.17.72 లక్షల నుండి రూ.19.37 లక్షల మధ్య లభిస్తుంది అని చెప్పవచ్చు.

2. ఆడి q5:
ఈ విలాసవంతమైన వాహనం ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీ తో సహా రెండు వేరియంట్లలో మనకు అందుబాటులో ఉంది . ఇక అనుష్క కొనుగోలు చేసిన రెండవ కారు ఇదే కావడం గమనార్హం.  ఈ కారు ధర సుమారుగా రూ.59.88లక్షల కావడం గమనార్హం.

3. ఆడి క్యూ 6:
అనుష్క సొంతం చేసుకున్న మూడవ కారు ఇది. ఇక ఇది పెట్రోల్ ఇంజన్ తో  వస్తున్న కారు మంచి డిజైన్ తో పాటు స్పోర్టివ్ గా కూడా ఉంటుంది. రూ.59.84 లక్షల నుంచి దీని ధర మార్కెట్లో మొదలవుతుంది.

ఇక వీటితో పాటు bmw 6 సీరీస్ ధర రూ. 69.88 లక్షల రూపాయలు. ఇక అంతే కాదు తన డ్రైవర్ కు పని పై ఉన్న అంకితభావాన్ని గుర్తించిన అనుష్క 12 లక్షల రూపాయల విలువైన కార్ ను  గిఫ్ట్ గా ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: