నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం క్రాక్ సినిమాతో పవర్ఫుల్ మాస్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి ఇప్పటికీ చాలా కాలం అవుతుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే బాలకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి కామెడీ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో బాలకృష్ణ 50 ఏళ్ళ వయస్సు ఉన్న వ్యక్తి గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ కూతురు గా శ్రీ లీల కనిపించబోతున్నట్లు ఒక వార్త చాలా రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో బాలకృష్ణ తో పాటు మరో హీరో కూడా కనిపించబోతున్నాడు అని అనేక రోజులుగా అనేక వార్తలు బయటకు వస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. మొదట్లో ఈ సినిమాలో రవితేజ నటించబోతున్నాడు అని వార్తలు వచ్చాయి, ఆ తర్వాత టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరు అయినా రాజశేఖర్  కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం బాలకృష్ణ,  అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే  సినిమాలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు ఆయన విక్టరీ వెంకటేష్ నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ, వెంకటేష్ గ్లాస్ మేట్స్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఫుల్ ఫన్ తో ఉండనునట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 , మరియు ఎఫ్ 3 సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: