తరాలు మారే కొద్ది కొత్త హీరోలు వస్తూనే ఉంటారు. వారు వారి యొక్క ప్రతిభ తో ప్రేక్షకులను అలరిస్తూనే వుంటారు. ఆ విధంగా ఈ తరం ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించిన
హీరో రౌడీ స్టార్
విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కొద్దిరోజులకే
అర్జున్ రెడ్డి సినిమా తో ఒక్కసారిగా సెన్సేషన్ సృష్టించారు
విజయ్ దేవరకొండ. ఆ
సినిమా ఆయనకు తెచ్చిపెట్టిన విజయం తీసుకువచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
రెండు చిత్రాలతోనే స్టార్ హీరోగా ఎదిగిన
విజయ్ దేవరకొండ తర్వాత చేస్తున్న సినిమాలతో తన స్టార్డమ్ ను కాపాడుకోవడంతో ఇంతటి స్థాయిలో హీరోగా ఎప్పుడు ఎదగగలిగాడు. గీత గోవిందం టాక్సీ వాలా
డియర్ కామ్రేడ్ వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు ను తీసుకు వచ్చాయి. అందుకే ఇప్పుడు ఆయన చేస్తున్న లైగర్
సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రేక్షకులలో ఈ
సినిమా పై అంచనాలు భారీ గానే ఉన్నాయి. అయితే ఈ చిత్రం పాన్
ఇండియా స్థాయిలో ఈ రేంజ్ లో విడుదల కాబోతు ఉండడం
టాలీవుడ్ పెద్ద హీరోలకు వణుకు పుట్టిస్తుంది. తాము ఇన్నాళ్లూ చచ్చి చెడి ఏర్పాటు చేసుకున్న స్టార్ డం ఇప్పుడు
విజయ్ దేవరకొండ తక్కువ కాలంలోనే అందుకోవడం వారికి మింగుడు పడటం లేదట. ఓవైపు ఈ
హీరో ఎక్కడ తమ ను దాటిపోతాడో అన్న భయం కూడా వారిలో నెలకొందట. మరి ఇదే విధంగా
విజయ్ దేవరకొండ వరుస విజయాలు సాధించి కుంటూపోతే టాలీవుడ్లో తొందర్లోనే నెంబర్ వన్ హీరోగా ఎదగడం ఖాయమని చెప్పాలి.