తెలుగు సినీ ప్రేమికులకు నటి అర్చన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అనేక సినిమాల్లో హీరోయిన్ గా , ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన అర్చన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరుచుకుంది .

ఎన్నో సంవత్సరాల పాటు హీరోయిన్ గా , ఇతర పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్న అర్చన గత కొద్ది కాలంగా మూవీ లకు దూరంగా ఉంటున్న విషయం మాన్స్ అందరికీ తెలిసిందే . అర్చన తెలుగు తో పాటు తమిళ , మలయాళ , కన్నడ భాషా సినిమాల్లో కూడా నటించి ఆ ఇండస్ట్రీ లలో కూడా నటిగా మంచి గుర్తింపు ను తెచ్చుకుంది . అర్చన కొంత కాలం క్రితమే తెలుగు రియాల్టీ షో లలో ఒకటి అయిన బిగ్ బాస్ షో లో కూడా పార్టిసిపేట్ చేసి ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్చన అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

తాజా ఇంటర్వ్యూలో అర్చన మాట్లాడుతూ... మగధీర మూవీ లో చేయమని రాజమౌళి గారు ఆఫర్ ఇచ్చారు అని , కాకపోతే అప్పుడు అంత లౌక్యం లేకపోవడంతో ఆ మూవీ చేయలేదు అని అర్చన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే నిజంగా ఆ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదేమో అని అర్చన పేర్కొంది. అలాగే ఈ ఇంటర్వ్యూ లో భాగంగా కొన్ని పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి మిస్ అవుతూ ఉంటాయి అని అర్చన పేర్కొంది. ఇలా తాజా ఇంటర్వ్యూలో అర్చన అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: