లావణ్య త్రిపాటి తాజాగా హ్యాపీ బర్త్ డే అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మత్తు వదలరా మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న రితీశ్ రానా దర్శకత్వం వహించగా, ఈ మూవీ లో నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 

ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లకు, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న హ్యాపీ బర్త్ డే సినిమాను జూలై 8 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే హ్యాపీ బర్త్ డే చిత్ర బృందం అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో హ్యాపీ బర్త్ డే చిత్ర బృందం తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.

సెన్సార్ బోర్డ్ నుండి హ్యాపీ బర్త్ డే చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని హ్యాపీ బర్త్ డే చిత్ర బృందం తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. మత్తు వదలరా లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తర్వాత రితీశ్ రానా దర్శకత్వం వహించిన సినిమా కావడంతో హ్యాపీ బర్త్ డే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను నవీన్ యెర్నేని ,  వై రవి శంకర్ లు సమర్పకులు గా వ్యవహరిస్తూ ఉండగా , ఈ మూవీ ని క్లాప్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై చిరంజీవి, హేమలత లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: