
అయితే అటు కోలీవుడ్ లో ఎన్ని ఆఫర్లు వస్తున్నా ఎంతో మంది హీరోయిన్లు అటు టాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని భావిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రియాంక అరుల్ మోహన్ కూడా ప్రస్తుతం బాలీవుడ్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి బంపర్ ఆఫర్ తలుపుతట్టిందట. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా పట్టాలెక్కెందుకు సిద్ధమౌతుంది. ఇక మరికొన్ని రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇక మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ప్రియాంక అరుల్ మోహన్.
అదేంటి మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా సెలెక్ట్ అయింది కదా మళ్లీ ఇప్పుడు ప్రియాంక అరుల్ మోహన్ ఏంటి.. అంటే పూజా హెగ్డే ని తీసేసారా అని కన్ ఫ్యూజన్ లో పడిపోయారు కదా. పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా మహేష్ సినిమాలో నటిస్తుండగా ప్రియాంక అరుల్ మోహన్ సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రియాంక అరుల్ మోహన్ దక్కించుకున్న సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం ముందుగా పెళ్లిసందడి హీరోయిన్ శ్రీలీలను సంప్రదించినట్లు అప్పట్లో టాక్ కూడా వచ్చింది అనే విషయం తెలిసిందే.