బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అయినా మలైకా అరోరా మరియు హీరో అర్జున్ కపూర్ బ్రేకప్ విషయం గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా లో చాలా వైరల్ గా మారింది. అయితే ఇద్దరు కూడా కలిసి గత కొన్ని వారాలుగా ఎక్కడా కనిపించకపోవడంతో పలు వార్తలు ఎక్కువగా వినిపించాయి. అంతేకాకుండా వీరిద్దరికి ఇష్టమైన ఇల్లు ముంబై లో ఉండగా వాటిని కూడా అర్జున్ కపూర్ అమ్మేశారనే వార్తలు రావడంతో వీరిద్దరూ బ్రేకప్ అయ్యారని వార్తలకు మరింత బలంగా మారాయి. ఇ విషయం జాతీయ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది.



అయితే వీరిద్దరూ తాజాగా కలిసి ఒక పార్టీ లో పాల్గొనడం జరిగిందట. దీంతో ఆ పుకార్లకు బ్రేక్ పడ్డట్లు అయ్యింది అని సమాచారం ఇద్దరూ కూడా చాలా క్లోజ్ గానే ఆ పార్టీలో కనిపించడంతో వారిపై వచ్చిన  వార్తలు అన్ని పుకార్లే అన్నట్లుగా తేలిపోయింది. బాలీవుడ్ స్టార్స్ పలువురు హాజరైన రూప్సో బ్రదర్ పార్టీలు వీరిద్దరూ హాజరు అవ్వడంతో మీడియా దృష్టి వారి పైన పడినట్లు తెలుస్తోంది కలిసి ఇలా పార్టీకి రావడంతో అందరూ షాక్ గురయ్యారు. ఈ విషయాన్ని అక్కడ పార్టీకి హాజరైన కొంతమంది తెలియజేసినట్లుగా సమాచారం.


అర్జున్ కపూర్ కంటే మలైకా 10 సంవత్సరాల వయసు పెద్దది. దింతో వీరిద్దరి ప్రేమ వ్యవహారం చాలా స్పెషల్ గా చూస్తోంది బాలీవుడ్. పైగా మలైకా సుదీర్ఘకాలం పాటు ఆర్జాజ్ ఖాన్ తో వైవాహిక జీవితం కలిపి కొన్ని సంవత్సరాల క్రితం విడిపోయారు. విడిపోయినప్పటి నుంచి అర్జున్ కపూర్ తో ఈమె రిలేషన్ లో ఉన్న వార్తలు బాగా వినిపించాయి. అయితే ప్రస్తుతం వీరిద్దరూ ఇలా పార్టీకి హాజరు కావడంతో వీరిద్దరి మీద వచ్చిన వార్తలకు పుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. దీంతో వీరిద్దరూ ఇంకా ప్రేమలో ఉన్నారనే విషయం పై క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: