కన్నడ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిచ్చ సుదీప్ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో ముఖ్యమైన కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను కూడా దోచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే కిచ్చ సుదీప్ తాజాగా విక్రాంత్ రోనా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అనూప్ బండారి దర్శకత్వం వహించగా , జాక్వలిన్ ఫెర్నాండెజ్ , రవిశంకర్ గౌడ ఈ మూవీ లో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ ని రేపు అనగా జూలై 28 వ తేదీన భారీ ఎత్తున కన్నడ తో పాటు తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం ఈ సినిమా టికెట్ లను ఆన్లైన్ బుకింగ్ లో మూవీ యూనిట్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా బెంగళూర్ సిటీ కి సంబంధించిన టికెట్ లను కూడా మూవీ యూనిట్ బుకింగ్ లలో పెట్టారు. అయితే బెంగుళూర్ సిటీ లో ఈ మూవీ కి అడ్వాన్స్ బుకింగ్ ల విషయంలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది అని చాలా మంది అనుకున్నారు.  

కాక పోతే ఆశ్చర్యంగా బెంగుళూర్ సిటీ లో విక్రాంత్ రోనా మూవీ కి సంబంధించిన బుకింగ్ లు పేలవంగా ఉన్నట్లు తెలుస్తోంది. మల్టీప్లెక్స్ థియేటర్ లలో 3 డి వెర్షన్ బుకింగ్ లకు సంబంధించి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తున్నప్పటికీ , ఈ మూవీ 2డి వర్షన్ కి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ లకు మాత్రం పేలవమైన ఆదరణ లభిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: