కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాఘవ లారెన్స్ దక్షిణాది సినిమా రంగంలో ఎందరో టాప్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ అందించాడు. ఆతరువాత హీరోగా మారడంతో హర్రర్ సినిమాల హీరోగా కోలీవుడ్ టాలీవుడ్ లలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘కాంచన’ సిరీస్ సినిమాలతో ఇతడి పేరు మరింత మారుమ్రోగిపోయింది. ప్రస్తుతం ఇతడు రజనీకాంత్ కెరియర్ లో సంచలన విజయం సాధించిన ‘చంద్రముఖి’ మూవీ సీక్వెల్ లో నటిస్తున్నాడు.


పి. వాసు దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ విడుదలైన  2005లో ఇండస్ట్రీలో ఒక సంచలనాన్ని సృష్టించింది. అప్పటివరకు వరస ఫైయిల్యూర్స్ తో ఉన్న రజనీకాంత్ ను తిరిగి దక్షిణాది సూపర్ స్టార్ గా ఈమూవీ మార్చివేసింది. ఇప్పుడు మళ్ళీ ఈమూవీకి సీక్వెల్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలై 15 నుంచి మైసూర్ లో జరుగుతోంది. `చంధ్రముఖి` లో బసవయ్యగా నటించి కామెడీ చేసిన వడివేలు సీక్వెల్ లో నటిస్తున్నాడు.


ఈమూవీ షూటింగ్ ప్రారంభానికి ముందు రాఘవ లారెన్స్ రజనీకాంత్ ఇంటికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించి రజనీ ఆశీర్వాదం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈమూవీలో చంద్రముఖి గా ఎవరు నటిస్తున్నారు అన్న విషయమై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఎవరు ఊహించని విధంగా ‘చంద్రమిఖి 2’ లో ఐదుగురు పాపులర్ హీరోయిన్స్ నటిస్తూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.


ఈమూవీలో లక్ష్మీ మీనన్ మహిమ నంబియార్ మంజిమ మోహన్ సృష్టి దాంగే సుభీక్ష కృష్ణన్ లు రాఘవ లారెన్స్ పక్కన నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీకి ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తుంటే ఆర్.డి. రాజశేఖర్ ఛాయాగ్రహణం ప్రొడక్షన్ డిజైనర్ గా పద్మశ్రీ తోట తరణి పని చేస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్య కాలంలో సీక్వెల్స్ ను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. అదే జరిగితే రాఘవ లారెన్స్ పేరు జాతీయ స్థాయిలో మారుమ్రోగిపోతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: