
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయిన ఈ మూవీ మరికొద్దిరోజుల్లో పట్టాలెక్కనుంది. అలానే అధికారికంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ పై మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే దీని తరువాత ఎస్ ఎస్ రాజమౌళితో తన కెరీర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ చేయనున్నారు మహేష్ బాబు. ఇక విషయంలోకి వెళితే నెక్స్ట్ త్రివిక్రమ్ మూవీ కోసం ఇప్పటికే ఫుల్ గా క్రాఫ్, గడ్డం పెంచిన మహేష్ బాబు, మరోవైపు ఫుల్ గా బాడీ కూడా పెంచేందుకు సిద్ధం అవుతున్నారు.
ఫిసికల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్ నేడు సూపర్ స్టార్ మహేష్ తో కలిసి దిగిన పిక్ ని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. ఇక ఇటీవల మహేష్ రాజమౌళి మూవీ గురించి మాట్లాడుతూ, ఆ మూవీ ఎంతో భారీ స్థాయిలో రూపొందనుండడంతో పాటు దానికోసం ఫిసికల్ గా కూడా ఎంతో వర్కౌట్ చేయాల్సి ఉందని అన్నారు. సో దీనిని బట్టి ప్రస్తుతం ఫిసికల్ ట్రైనర్ ఆధ్వర్యంలో రాజమౌళి మూవీ కోసం ఫుల్ గా బాడీ బిల్డప్ చేసేందుకు సిద్ధం అయిన మహేష్, కొంతవరకు ఆ లుక్ లోనే మనకు త్రివిక్రమ్ మూవీలో కూడా కనపడనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి రాబోయే రోజుల్లో ఆయన నుండి ఫుల్ ఐ ఫీస్ట్ లభించనున్నట్లు తెలుస్తోంది. అబ్బా నిజంగా సూపర్ స్టార్ మహేష్ డబుల్ ప్లానింగ్ సూపర్ అంటున్నారు విశ్లేషకులు.