టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని తెలుగు లో నాని నిర్మించాడు. తెలుగు లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఇలా తెలుగు లో హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం ఈ మూవీ కి సీక్వెల్ గా హిట్ ది సెకండ్ కేస్ మూవీ ని తెరకెక్కిస్తున్నారు.  

మూవీ లో అడవి శేషు హీరోగా నటిస్తున్నాడు. హిందీ లో దిల్ రాజు హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ లో రాజ్ కుమార్ రావు హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన హిట్ ది ఫస్ట్ కేస్ హిందీ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది. దానితో చివరకు ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలి పోయింది. ఇలా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి రాబోతోంది. ఈ సినిమా  'ఓ టి టి' విడుదలకు సంబంధించిన అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది.  

హిట్  ది ఫస్ట్ కేస్ హిందీ మూవీ ని ఆగస్ట్ 28వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో ఒకటైన నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని ఎవరైనా థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఆగస్ట్ 28 వ తేదీ నుండి నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: