టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున తరువాతి సినిమా ది ఘోస్ట్ భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. నాగార్జున ఎలాగైనా ఈ సినిమాతో మంచి హిట్ ని అందుకోవాలని అనుకుంటున్నాడు.నాగార్జున సోలోగా హిట్ కొట్టి చాలాకాలం అయింది. అప్పుడెప్పుడో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమా తర్వాత మళ్లీ సరైన సక్సెస్ దక్కలేదు. అందుకే ఎలాగైనా ది ఘోస్ట్ సినిమాతో తన మార్కెట్ ని  పెంచుకోవాలని అనుకుంటున్నాడు.ఇక ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించడంతో ఓవర్గం ప్రేక్షకులలో అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. అలాగే ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో కూడా చిత్ర యూనిట్ కొనసాగుతున్న విధానానికి పాజిటివ్ టాక్  అందుతొంది.ఇక రీసెంట్ గా కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఒక పోస్టర్ కూడా మంచి హైప్ అయితే క్రియేట్ చేస్తోంది. నాగార్జునను అభిమానులు ఎక్కువగా మన్మధుడు అనే ట్యాగ్ తో పిలుచుకుంటూ ఉంటారు.ఇంకా కింగ్ ట్యాగ్ కూడా ఆయనకు కరెక్ట్ గా సెట్ అవుతుంది.


ఇక ఇప్పుడు విడుదల చేసిన ది ఘోస్ట్ పోస్టర్లో ఆయన చేతిలో కత్తి పట్టుకుని ఒక కింగ్ తరహాలోని దర్శనం ఇస్తున్నారు. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ది ఘోస్ట్ సినిమాలో నాగార్జున ఒక పవర్ఫుల్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. తన సోదరి కూతురికి బాడీగార్డ్ గా విలన్స్ తో ఏ విధంగా పోరాడాడు అనేది ఈ సినిమా కథ అని తెలుస్తోంది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుంది అనే నమ్మకంతోనే భారీ స్థాయిలో సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇక సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా ఫినిష్ అయ్యాయి.ఇక సినిమాను అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయాలని డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. ఇక అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ లో ఏ హీరో గెలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: