సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడు ఇండియా లోనే మోస్ట్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ ని కొన సాగిస్తున్నాడు . ఎక్కువ శాతం తమిళ మూవీ లకు సంగీత దర్శకుడు గా పని చేస్తున్న అనిరుద్ రవిచంద్రన్ తెలుగు లో ఆజ్ఞాత వాసి ,  నాన్ ఇస్ గ్యాంగ్ లీడర్ వంటి తెలుగు మూవీ లకు కూడా సంగీతాన్ని అందించాడు . ఈ మూవీ లు బాక్సా ఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని సాధించక పోయి నప్పటికీ ఈ మూవీ లోని పాట లకు మాత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనిరుద్ రవి చంద్రన్ చేతి లో ఉన్న క్రేజీ ప్రాజెక్టు ల గురించి తెలుసు కుందాం .

కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వం లో తెరకెక్కు తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఇండియన్ 2 అనిరుద్ రవిచంద్రన్ ప్రస్తుతం సంగీతాన్ని అం దిస్తున్నాడు . బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరో గా అట్లీ దర్శకత్వంలో తెర కెక్కుతున్న జవాన్ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ కి కూడా అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనున్నాడు. ఈ మూవీ లతో పాటు తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ కి కూడా అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: