గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణిరత్నం తన కెరియర్ లో ఇప్పటికే ఎన్నో వైవిద్యమైన మూవీ లకు దర్శకత్వం వహించి ఇండియా లోనే గొప్ప దర్శకుడి గా పేరును తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇండియా లోనే గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్న మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో చియన్ విక్రమ్ , కార్తీ ,  జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష శోభితా ధూళిపాల , ప్రకాష్ రాజు వంటి నటులు ముఖ్య పాత్రలలో కనిపించ బోతున్నారు. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కాబోతుంది. అందులో మొదటి భాగం సెప్టెంబర్ 30 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు ,  కన్నడ ,  మలయాళ ,  హిందీ భాషల్లో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. పొన్నియన్ సెల్వన్ మూవీ తీయాలని ఆలోచన 1994 వ సంవత్సరం లోనే వచ్చింది అని మణిరత్నం చెప్పు కొచ్చాడు. తొలిత ఈ మూవీ ని కమల్ హాసన్ తో ప్లాన్ చేశాను అని ,  అనివార్య కారణాల వల్ల అది ఫలించలేదు అని తెలిపారు. అలాగే 20 సంవత్సరాలు ఈ కథతో ప్రయాణం సాగించినట్లు , అలాగే అప్పట్లో ఐశ్వర్య రాయ్ పాత్ర కోసం రేఖను ఎంపిక చేసుకున్నాను అని కూడా మణిరత్నం పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: