ఒకప్పుడు ఇండస్ట్రీలో లవర్ బాయ్గా బాగా గుర్తింపు సంపాదించుకున్న హీరో తరుణ్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఒకప్పుడు వరుస విజయాలతో ప్రేక్షకులను అలరించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే తరుణ్ స్టార్ హీరో అవ్వడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం అతని కెరియర్ ఒక్కసారిగా డీలా పడిపోయింది. తరుణ్ కెరియర్ నాశనం కావడానికి అతని జీవితంలో ఉన్న ఇద్దరు ఆడవాళ్లే కారణం అన్నది మాత్రం తెలుస్తుంది.


 ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, చిరుజల్లు, నువ్వే నువ్వే లాంటి వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలతో ఒక్కసారిగా తెలిమెదికి వచ్చాడు తరుణ్. ఆ తర్వాత కాస్త తప్పటడుగులు వేశాడు. అదృష్టం అనే సినిమా తీయడంతో ఈ సినిమా ప్లాప్ అయ్యింది.  ఇక తర్వాత నిన్నే ఇష్టపడ్డాను సినిమా తీసి మరోసారి హిట్టు కొట్టాడు. తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తో వరుసగా దూసుకుపోయాడు. కానీ తరుణ్ కెరియర్ నాశనం కావడానికి వాళ్ళ అమ్మగారే కారణమట. తరుణ్ తల్లి రోజా రమణి తెలుగు నటి అన్న విషయం తెలిసిందే. 1970-80 దశకంలో  ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది. కాగా తరుణ్ సినిమాలో రాణిస్తున్న సమయంలో ఆర్తి అగర్వాల్ తో ప్రేమలో పడటం  రోజా రమణికి  నచ్చలేదంట.


 తరుణ్ కు వార్నింగ్ ఇచ్చి మరి ఆర్తి అగర్వాల్ ను దూరం పెట్టాలి అంటూ హెచ్చరించిందట తల్లి. ఇలా చేయడం కారణంగా తరుణ్ అటు సినిమాలపై పెద్దగా ఫోకస్ పెట్టలేకపోయాడు అన్న టాక్  ఉంది. ఒకవైపు ఆర్తి అగర్వాల్ ను వదులుకోవడం ఇష్టం లేక ఇంకోవైపు అమ్మ మాట కాదనలేక ఎంతగానో సతమతమయ్యాడు.  తర్వాత కాలంలో ఆర్తి అగర్వాల్ తరుణ్ పరువు తీసేసింది అన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి తరుణ్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇలా తరన్ జీవితంలో ఇద్దరు ఆడవాళ్ళ కారణంగానే అతని లైఫ్ మొత్తం పాడైంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: