చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లది ఓ ప్రత్యేకత గుర్తింపు ఉంది, ఇద్దరు పోటీపడి తెగ నటించారు. ప్రేక్షకులను మెప్పించారు. నటన పరంగా వారికి ఎదురే లేకుండా పోయింది.

ఒకరు పౌరాణిక పాత్రలు చేస్తే మరొకరు ప్రేమికుడి పాత్రల్లో ఒదిగిపోయారు. వారికి తిరుగేలేదనిపించారు. ఇక వారి వారసులుగా వచ్చిన వారు కూడా అలానే రాణించారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ రాణిస్తుండగా కల్యాణ్ రామ్ నిర్మాత, నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఏఎన్ఆర్ కుటుంబం నుంచి ఒక్క నాగార్జున మాత్రమే తన సత్తా చాటుతున్నాడు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన సుమంత్, సుశాంత్ లు కూడా  అంతాలా ఆకట్టుకోలేకపోయారు. ప్రస్తుతం నాగచైతన్య, అఖిల్ కూడా అదే ప్రయత్నాల్లో  ఉన్నారు, ఇంతవరకు వారి శ్రమకు తగిన ఫలితం అస్సలు రాలేదు.

దీంతో అక్కినేని కుటుంబం నైరాశ్యంలో పడింది. తమకు అవకాశాలు ఉన్నా తగిన హిట్లు లేకపోవడంతో ఏం చేయలేకపోతున్నారు. సుమంత్ మొదట్లో అడపాదడపా హిట్లు సాధించినా సుశాంత్ మాత్రం మొత్తానికి పేరు తెచ్చుకోలేకపోయాడు. దీంతో సుశాంత్ మొదటి సినిమా కాళిదాసుతోనే అతడిలో హీరో లక్షణాలు లేవని మనకు తేలిపోయింది. ఇక అల వైకుంఠపురంలో ఓ సైడ్ క్యారెక్టర్ చేసి ఫర్వాలేదనిపించుకున్నాడు ఈ యంగ్ హీరో . కానీ హీరో కావాల్సిన వాడు ఇలా చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తే ఏం లాభం అనే భావన వస్తోంది.

కాళిదాసు సినిమా విడుదలయ్యాక సుశాంత్ తన దురదృష్టానికి ఆత్మహత్యా యత్నం చేశాడని వార్త అప్పట్లో సంచలనం కలిగించింది. నాగార్జున కూడా ఆస్పత్రికి వెళ్లి బోరున విలపించాడట. ఆ విషయం బయటకు రాకుండా అక్కినేని కుటుంబం  చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. మెగా, నందమూరి కుటుంబాల్లో అందరు హీరోలుగా రాణిస్తున్న క్రమంలో తమకెందుకు ఈ దుస్థితి అని బాధపడుతున్నారు. అక్కినేని వారసులుగా వచ్చినా వారికి నిరాదరణే మిగులుతోంది. వారిలో ఉన్న టాలెంట్ ను వారు బయటపెట్టకుండా ఉండటంతోనే ఇలా జరుగుతోందని పలువురి  అంటున్నారు . ప్రతి నటుడు అతడిలోని ప్రతిభకు పదును పెడితేనే కదా రాణించేది. అక్కినేని కుటుంబానికి సంబంధించి ఎవరు కూడా ఎదగకపోవడం వారిలో బాధ కలిగిస్తోంది.

సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే బ్యాక్ సపోర్టు తోపాటు టాలెంట్ కూడా ఉండాలి. అది లేకపోతే సుమంత్, సుశాంత్ ల పరిస్థితి ఇలానే ఉంటుంది. సుశాంత్ కీర్తిరెడ్డితో విడాకులు తీసుకున్న తరువాత అతడిని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో అతడి గురించే అందరు మరిచిపోయారు. తన కెరీర్ ను ఎంతో అందంగా ఊహించుకున్నా సరైన హిట్లు లేకపోవడంతో మరుగునపడిపోయాడు సుశాంత్

మరింత సమాచారం తెలుసుకోండి: