నిర్మాత ఏక్తాకపూర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందట.. తన వెబ్ సిరీస్ ఎక్స్ఎక్స్ఎక్స్ లో అభ్యంతరకరమైన కంటెంట్ పై ఇవాళ సుప్రీంకోర్టు తీవ్రంగా విరుచుకుపడిందని తెలుస్తుంది.


ఏక్తాకపూర్ దేశంలోని యువత మనస్సులను కలుషితం చేస్తోందని పేర్కొంది. తన OTTఫ్లాట్ ఫాం ALTబాలాజీ లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ లో సైనికులను అవమానించారని..వారి కుటుంబాల మనోభావాలను దెబ్బతీసినందు కు తనపై జారీ చేసిన అరెస్టు వారెంట్ ను సవాలు చేస్తూ ఏక్తా కపూర్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించిందట..


ఏక్తాకపూర్ ఓటీటీ ఫ్లాట్ పాం ఆల్ట్ బాలాజీ ఎక్స్ఎక్స్ ఎక్స్ వెబ్ సిరిస్ ప్రసారం అవుతోంది. ట్రిపుల్ ఎక్స్ సిజన్ 2లో సైనికుని భార్యకు సంబంధించిన సన్నివేశాలు చాలా అభ్యంతకరం గా ఉన్నాయని శంభుకుమార్ అనే మాజీ సైనికుడు ఫిర్యాదు చేశాడని తెలుస్తుంది.. దీనిపై బీహార్ లోని బేగుసరాయ్ ట్రయల్ కోర్టు ఏక్తాకపూర్ ను అరెస్టు చేసేందుకు వారెంట్లు జారీ చేసింది. అరెస్టు వారెంటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ఆశ్రయించింది. ఏక్తాకపూర్ లాయర్ వాదనలు వినిపించారు. తాము పాట్నా హైకోర్టు పిటిషన్ దాఖలు చేశామని…త్వరగా విచారణకు వస్తుందనుకోవడం లేదని..ఇలాంటి కేసులో గతంలో సుప్రీంకోర్టు ఆమెకు ఉపశమ ని కల్గించిదని గుర్తు చేశారు. ఓటీటీ లో ప్రేక్షకులు తమకు నచ్చిన కంటెంట్ ను ఎంచుకునే స్వేచ్చ అయితే ఉందన్నారు. ఈ వాదనపై కోర్టు సీరియస్ అయ్యింది. ఈ దేశ యువత మనస్సులను మీరు కలుషితం చేస్తున్నారని ఓటీటీ ద్వారా వెబ్ సిరీస్ అందరికీ అందుబాటులో ఉంటుంద ని కోర్టు పేర్కొంది.



మీరు ప్రతిసారీ కోర్టుకు వస్తున్నారు. దీన్ని మేము సమర్థించలేము. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసినందుకు మీకు జరిమానా విధిస్తామంటూ కోర్టు మండిపడిందట.. ఈ విషయాన్ని మీ క్లయింటుకు కూడా చెప్పండి. నోరున్న వారి కోసం ఈ కోర్టు లేదని అసహనం వ్యక్తంచేసిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: