మహానటి సావిత్రి తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంతటి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తు వచ్చేది మాత్రం సౌందర్య


ఈమె ఏ మాత్రం గ్లామర్ ని పాత్రల్లో నటించకుండా కేవలం తన నటనతోనే ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుంది. ఈమె చేసిన ఏ పాత్రలో కూడా వల్గారిటీ అనేది అస్సలు కనిపించలేదు. హోమ్లీ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కేవలం టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అదేవిధంగా కన్నడ, తమిళ, మలయాళ స్టార్ హీరోలందరితో ఈమె హీరోయిన్గా నటించింది. ఇక సౌందర్య చేసిన ఎక్కువ సినిమాలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలే.


అంతేకాకుండా వెంకటేష్, చిరంజీవి లకు సౌందర్య మంచి జోడీ గా ఉండేది. వీరి కాంబినేషన్ లో వచ్చే సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యేవి. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే సౌందర్య వెంకటేష్ ది హిట్ పెయిర్ అని చెప్పుకోవచ్చు. వీరిద్దరి కాంబినేషన్ లో ఏదైనా సినిమా వస్తే కనుక అది కచ్చితంగా బ్లాక్ బస్టర్ అని చాలామంది దర్శక నిర్మాతలు భావించేవారు. ఇక ఒకానొక సందర్భంలో సౌందర్య డేట్స్ కోసం చాలామంది దర్శక నిర్మాతలు వెయిట్ చేసేవారు. ఇక సినిమాలో హీరోయిన్ గానే కాకుండా సౌందర్య కొన్ని ప్రత్యేక పాటల్లో కూడా కనిపించింది. అయితే ఇది పెద్ద వింత విషయం ఏమీ కాదు. ఎందుకంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఉంటున్న కాజల్, సమంత, పూజ హెగ్డే వంటి హీరోయిన్స్ కూడా భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తే ఐటమ్ సాంగ్స్ లో చేస్తున్నారట.


అయితే ఇప్పటి హీరోయిన్లకు ఐటం సాంగ్స్ చేయడం లో హీరోయిన్ సౌందర్య ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సౌందర్య మాయలోడు అనే సినిమాలో కమెడియన్ బాబు మోహన్ తో కలిసి చినుకు చినుకు అందెలతో అనే ఓ అద్భుతమైన పాటలో మాస్ స్టెప్పులు వేసి అందరినీ కూడా ఆకర్షించింది. అయితే ఈ పాట చేసే టైం కి సౌందర్య ఇండస్ట్రీలో చాలా బిజీ హీరోయిన్. కానీ ఐటెం సాంగ్ ఓ స్టార్ హీరో తో చేస్తే ఓకే..కానీ బాబు మోహన్ లాంటి కమెడియన్ తో ఐటెం సాంగ్ చేయడం అంటే ఏ హీరోయిన్ కూడా ఒప్పుకోదు. కానీ సౌందర్య మాత్రం ఎస్ వి కృష్ణారెడ్డి గారి కోసం ఈ పాటలో చేయడానికి ఒప్పుకుందట.కానీ పాటలో డ్యాన్స్ చేస్తున్న టైంలో బాబు మోహన్ కనుక నన్ను తాకితే కచ్చితంగా కొట్టేస్తానంటూ సరదాగా అప్పుడు చెప్పిందట. కానీ ఈ పాటలో ఎక్కడా కూడా సౌందర్య బాబు మోహన్ మధ్యలో టచ్చింగ్స్ అంతగా కనిపించలేదట.ఇక ఈ పాట చూస్తే అందరికీ ఈ విషయం అర్థమవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: