ప్రభాస్ హీరో గా తెరకెక్కే నాలుగైదు సినిమాలు సెట్స్ పైన ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆ సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ఈనేపథ్యంలో అయన తాజాగా మరో సినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి రంగం సిద్ధం చేయడం అందరిని ఎంతో సంతోషపెడుతుంది. మారుతి దర్శకత్వంలో హార్రర్ కామెడీ జానర్‌లో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల నుంచి ఈ సినిమా కి సంబంధించి వార్తలు వస్తున్నా కూడా ఎవరు నమ్మలేదు. తాజాగా ఈ సినిమా యొక్క ఫోటో షూట్ జరగడంతో ఈ సినిమా ను చేస్తున్నారు అని అందరు కంఫర్మ్ చేసుకున్నారు.

సినిమా లో మొత్తం ముగ్గురు హీరోయిన్ లు నటిస్తుండగా ఇప్పటివరకు ఇద్దరిని ఎంపిక చేశారని చెప్పొచ్చు. మాళవిక మోహనన్సినిమా లో హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ గా నిధి అగ్గార్వాల్ ఎంపిక అయ్యింది. ఆ విధంగా ప్రభాస్సినిమా ను రేపటినుంచి సినిమా ను మొదలుపెట్టడం విశేషం.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ కూడా పూర్తి అయ్యింది. మారుతీ చాలా రోజుల ముందే ఈ సినిమా కి సంబందించిన స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి ప్రభాస్ డేట్స్ కోసం ఎంతో ఎదురుచూశాడు. ఆ విధంగా ఈ సినిమా మొదలు కావడం విశేషం.

ఏదేమైనా ఈ సినిమా రేపటి నుంచి షూటింగ్‌ను ప్రారంభించనుందని తెలుస్తోంది. ఇది ప్రభాస్ అభిమానులను ఎంతో సంతోషపెడుతుంది. ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎక్కువ భాగం ఓ ఇంట్లోనే జరుగునుందట. తక్కువ సమయంలో అయిపోయే సినిమా కాబట్టి ప్రభాస్ ఈ చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్నాడని చెప్పవచ్చు.  దీంతో ఆ ఇంటికి సంబంధించిన సెట్‌ను టీమ్ భారీగా నిర్మింనున్నట్లు తెలుస్తోంది. ఆ ఇంటి సెట్ కోసమే దాదాపు 6 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. ఇక హార్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నారట.అయితే కొంతమంది సినిమా విశ్లేషకులు ప్రభాస్ మొదలుపెట్టిన సినిమాలను చేయకుండా ఈ విధంగా కొత్త సినిమాలను మొదలుపెట్టడం ఎంత వరకు కరెక్ట్ అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: