కొన్ని కొన్ని సార్లు కొంతమంది దర్శకులు హీరోలను నమ్మి చాలా సమయాన్ని కోల్పోతూ ఉంటారు. హీరోలు తమ
సినిమా కథలను ఒప్పుకొని పూర్తిస్థాయి స్క్రిప్ట్ చేసేంతవరకు వారితో
సినిమా చేస్తానని చెప్పి ఫైనల్ గా ఫుల్ నేరేషన్ లో వారికి కథ నచ్చలేదని చెప్పి ఆ సినిమాను క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. ఇది చాలామంది దర్శకులకు జరిగింది ఇప్పుడు కూడా చాలామంది దర్శకులకు జరుగుతుంది.
కథతో హీరోని మెప్పించ గలిగిన వీరు ఫుల్ నరేషన్ తో మెప్పించకపోవడం నిజంగా వారి ఫెయి ల్యూర్ అయినప్పటికీ హీరోలు చాలా సమయం తీసుకుని వారి సమయాన్ని వృధా చేసి చివరకు ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేయడం వారిలో ఎంతో బాధను కలిగిస్తుంది. ఆ విధంగా మెగా హీ రోలు ఈ విధంగా ఇటీవల కాలంలో ఎక్కువగా దర్శకులను బాధపెడుతున్నారన్న విషయం
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హల్చల్ అవుతుంది.
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సిని మాకి ముగ్గురు దర్శకులను మార్చడం ఈ విధమైన చర్చకు ఎక్కువగా తెర తీస్తుంది.
గతంలో
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు చాలామంది దర్శకులను పరిశీలించాడు. ఫైనల్ గా వినా యకుడు ఓకే చేసి ఆ చిత్రా న్ని చేశా డు.
గాడ్ ఫాదర్ సినిమాకి మొదటగా
సుజిత్ దర్శకుడిగా అనుకొని ఆ తర్వాత వినాయకుడు ఎంపిక చేశారు ఆ తర్వాత ఇద్దరిని కూడా పక్కనపెట్టి ఫైనల్ గా
మోహన్ రాజా దర్శకుడుగా ఎంపిక చేశారు. ఇప్పుడు
రామ్ చరణ్ కూడా
తండ్రి లాగానే చేస్తూ ఉండటం కొంతమంది దర్శకులను ఎంతగానో ఇబ్బందులు పడుతుంది. ఇటీవల గౌతం తిననూరితో ఈ
హీరో చేయవలసిన
సినిమా ఎందుకో రిజెక్ట్ అయింది చాలా రోజుల సమయం తర్వాత
హీరో ఈ దర్శకుడి సినిమాను పక్కన పెట్టడం నిజంగా చాలా మందిని నిరాశపరిచింది.