తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి ,  ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ 1999 లో స్వయంవరం మూవీ ద్వారా మాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసాడు. ఆ తర్వాత నువ్వే కావాలి , నువ్వు నాకు నచ్చావ్ , మన్మధుడు వంటి సినిమాలకు కథ మరియు స్క్రీన్ ప్లే ను అందించాడు.

ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ,  తరుణ్ హీరోగా శ్రేయ హీరోయిన్ గా తెరకెక్కిన నువ్వే నువ్వే సినిమాతో మొట్ట మొదటి సారిగా సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక కీలకమైన పాత్రలో నటించగా , కోటి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ 10 అక్టోబర్ 2002 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హీరోగా తరుణ్ కు ,  హీరోయిన్ గా శ్రేయ కు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

మూవీ ఆ సమయంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇలా ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను ఈ సంవత్సరం త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో నవంబర్ 4 వ తేదీ నుండి నవంబర్ 10 వ తేదీ వరకు రీ రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 7 వ తేదీన త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ని రీ రిలీజ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: