తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న యువ హీరోలలో సంతోష్ శోభన్ ఒకరు. సంతోష్ శోభన్ ఇప్పటికే పేపర్ బాయ్ , ఏక్ మినీ కథ , మంచి రోజులు వచ్చాయి అనే మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. సంతోష్ శోభన్ నటించిన మూడు సినిమా లలో ఏక్ మినీ కథ మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఏక్ మినీ కథ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా  అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించగా ,  ఈ మూవీ లో యంగ్ బ్యూటీ ఫారియా అబ్దుల్లా , సంతోష్ శోభన్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని రేపు అనగా నవంబర్ 4 వ తేదీన గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 2.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2.5 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించినట్లు అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో ,  ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: