టాలీవుడ్ హీరో ,జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు అతని వెనుక కనిపిస్తున్నారని ఆయనను దగ్గర నుంచి పరిశీలిస్తూ ఆయనను వెంబడిస్తున్నారని ఒక పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనను జారీ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. జనసేన అధినేత బయటకు వెళుతున్నప్పుడు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు చాలా దగ్గర నుంచి బైకులు మీద ,కార్ల మీద వెంబడిస్తూ ఆయనను పరిశీలిస్తున్నారని ఒక వార్తను తెలియజేయడం జరిగింది నాదెండ్ల మనోహర్.


దీంతో అసలు పవన్ కళ్యాణ్ వెనుక పడాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటూ పెద్ద ఎత్తున పలు చర్చలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే నిజానికి గత రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు హల్చల్ చేస్తూ ఉన్నట్లు నాదెండ్ల మనోహర్ ఒక లెటర్ నుంచి తెలియజేశారు. అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందు వచ్చి సెక్యూరిటీ గార్డ్ తో వారు గొడవ పడడం జరిగిందని నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ హత్యకు కూడా కుట్ర జరిగిందని అందుకోసం రూ.250 కోట్ల రూపాయలు సుఫారి ఇచ్చారని ప్రచారం కూడా తెర మీదకు రావడం జరుగుతోంది.


2019 ఎన్నికల ముందే ఈ కుట్రకు బీజాలు ఏర్పడ్డాయని కేంద్రానికి వర్గాలు తెలియజేసినట్లు సమాచారం. పవన్ ను హత్య చేసేందుకు భారీగా సుహారి తీసుకున్నారని అందించినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇక ఆగస్టు 19న కడప జిల్లా సిద్ధవంటలు హత్య చేయడానికి ఆ జిల్లాలోని ఒక రైతు భరోసా సభలో కిరాయి హంతకులు సంచరిస్తున్నట్లుగా కూడా నిఘా వర్గాలు తెలిపాయని ఈ కథలో తెలియజేశారు. ఇక అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లో వెళుతూ ఉన్న సమయంలో ఒక గుర్తు తెలియని వాహనం అందులో ప్రవేశించింది అని సమాచారం. అయితే ఇందులో నిజం లేదని కొంతమంది రాజకీయ నాయకులు తెలియజేస్తున్నారు ఇదంతా కేవలం టిడిపి,జనసేన ఆడుతున్న డ్రామా అని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: