బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితం బ్రహ్మాస్త్ర అనే మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న రన్బీర్ కపూర్ హీరో గా నటించగా ,  బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న ఆలియా భట్మూవీ లో రన్బీర్ కపూర్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో అమితా బచ్చన్ ,  నాగార్జున ,  మౌని రాయ్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

ఇది ఇలా ఉంటే భారీ అంచనాల నడుమ విడుదల అయిన బ్రహ్మాస్త్ర మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసి , బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశారు. తెలుగు లో ఈ మూవీ ని ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సమర్పించాడు. తెలుగులో కూడా ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు లభించాయి.

ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను అందుకున్న బ్రహ్మాస్త్ర మూవీ ఈ రోజు నుండి అనగా నవంబర్ 4 వ తేదీ నుండి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా ఈ మూవీ ని చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: