ఎట్టకేలకు మిల్క్ బ్యూటీ అందాల భామ తమన్నా పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తను ఈమె వివాహం చేసుకోబోతోంది అని సమాచారం. ప్రస్తుతం తమన్నా గురించి జోరుగా ఈ వార్త సాగుతోంది. టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్ లు బిజినెస్ మాన్ లను పెళ్లి చేసుకున్నారు. శ్రియ , కాజల్, ప్రణీత, సంజన ఇలా అనేకమంది హీరోయిన్స్ వ్యాపారవేత్తలను వివాహం చేసుకుంటూ ఉండడం గమనార్హం. అటు హన్సిక కూడా బిజినెస్ మాన్ తోనే వివాహానికి సిద్ధమయింది. ఈ క్రమంలోనే తమన్నా కూడా పెళ్లి చేసుకోబోయేది ఒక వ్యాపారవేత్తనే అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

తమన్నా వయసు 32 సంవత్సరాలు అందుకే కొన్ని రోజుల క్రితమే తమన్న పెళ్ళికి ఓకే చెప్పిందట..ఇప్పుడు ముంబై కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు ఈమె వివాహం చేసుకోబోతున్నట్లు. అయితే ఈ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని,  తమన్నా తల్లిదండ్రులకు ఆమెకు కూడా బాగా నచ్చడంతో వివాహానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ మీడియాలో తమన్నా పెళ్లి గురించి జోరుగా వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం.  ఇదిలా ఉండగా తాజాగా తమన్నా పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి మరో ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది.

సదరు అబ్బాయికి కోట్లల్లో ఆస్తిపాస్తులు ఉన్నాయట.. ముంబైలో టాప్ బిజినెస్ మాన్ గా కొనసాగుతున్నారట.  అయితే అతడికి ఒక వింత జబ్బు ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.  అదేమిటంటే అతని ఒంటికి పడని ఫుడ్ ఏదైనా తింటే వెంటనే రియాక్షన్ జరిగి ర్యాషేష్ వస్తాయని సమాచారం.  ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అతనికి ఉన్న ఈ సమస్యను ఆలస్యంగా గుర్తిస్తే ప్రాణాలకే ప్రమాదం ఉందని సమాచారం. కానీ ఆ వ్యక్తి ఇలాంటి వింత వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఆస్తికోసం తమన్న అతడి వివాహం చేసుకోబోతుందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా ఈ విషయాలపై తమన్న స్పందిస్తుందో లేదో తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: