మహేష్ బాబు హీరోగా సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ఇప్పుడు క్యూలో ఉన్నారు అని చెప్పాలి. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ తో కలిసి ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ ఇంకా మొదలు పెట్టుకోలేకపోయింది. పలు కారణాలవల్ల ఈ సినిమా ముందుకు వెళ్లడం లేదని తెలుస్తుంది. తాజాగా మహేష్ తండ్రి కృష్ణ మరణించడంతో ఈ సినిమా మరికొన్ని రోజులు వాయిదా పడనుందని తెలుస్తుంది.

ఆ విధంగా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. ఇకపోతే రాజమౌళి సినిమా కోసం మహేష్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడని చెప్పాలి చాలా రోజులుగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని అభిమానులు కోరుకున్నారు. కానీ ఎవరికి వారు బిజీగా ఉండడంతో వారి కలయికలో సినిమా రాలేదని చెప్పాలి. ఫైనల్ గా ఇప్పుడు వీరి కలయికలో సినిమా రాబోతూ ఉండడం అందరిలో ఎంతో ఆసక్తిని కలుగజేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మాత్రమే కాకుండా ఆ తర్వాత మహేష్ చేయబోయే సినిమాల యొక్క లైనప్ ను ఏర్పరచుకుంటున్నాడని తెలుస్తుంది.

అందుకోసం కొంతమంది దర్శకుల కథలను కూడా వింటున్నాడట. ఇందులో ఎక్కువగా అగ్ర దర్శకులే ఉన్నారని తెలుస్తుంది. రాజమౌళి సినిమా తర్వాత ఆయనకు ఎలాగో పాన్ ఇండియా ఇమేజ్ వస్తుంది కాబట్టి ఆ సినిమా చేసిన తర్వాత ఎలాంటి సినిమా చేయాలి ఏ దర్శకుడు తో సినిమా చేయాలి అనే విధంగా ఆయన ఆలోచనలు చేస్తున్నారని తెలుస్తుంది. ఏదేమైనా మహేష్ అభిమానులను ఎంతగానో ఆసక్తి పరిచే విషయం రాజమౌళితో సినిమా మరి త్రివిక్రమ్ సినిమాపై కూడా త్వరగా క్లారిటీ ఇస్తే మంచిది అని వారు కోరుకుంటున్నారు దాదాపుగా ఈ సినిమా క్యాన్సిల్ అవ్వకపోవచ్చు అని కొన్ని రోజుల తర్వాత మహేష్ ఈ సినిమాను తప్పకుండా మొదలుపెట్టి పూర్తి చేస్తాడని వారు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: