తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి అడవి శేషు తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించగా , నేచురల్ స్టార్ నానిమూవీ ని నిర్మించాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని డిసెంబర్  2 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తుంది. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడడం తో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ కు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే నిన్న ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను నవంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 

తాజాగా హిట్ ది సెకండ్ కేస్ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను ఏ సమయానికి విడుదల చేయబోతున్న విషయాన్ని ప్రకటించింది. హిట్ ది సెకండ్ కేస్ మూవీ ట్రైలర్ ను రేపు అనగా నవంబర్ 23 వ తేదీన ఉదయం 11గంటల 07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ ఇప్పటికే బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో హిట్ ది సెకండ్ కేస్ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: