హీరో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.ఇక  `అద్భుతం` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ..ఆ తర్వాత `డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ` మూవీలో నటించింది. అయితే ఓటిటి వేదికగా విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆపై తమిళంలో రెండు మూడు సినిమాలు చేసిన ఈ బ్యూటీ రీసెంట్గా `ఆహ నా పెళ్ళంట` అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించింది.ఇక రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సిరీస్ కు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అయితే ఆమని,

 పోసాని మురళీకృష్ణ, హర్షవర్ధన్ తదితరులు ఈ సిరీస్ లో కీలకపాత్రలను పోషించారు. జీ5లో స్టీమింగ్‌ అయిన ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.ఇక  ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాని రాజశేఖర్.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల్లో పంచుకుంది.అయితే  ఈ క్రమంలోని శివాని మాట్లాడుతూ.. `ఆహనా పెళ్ళంట వెబ్ సిరీస్ లో పెళ్లికూతురు లేచిపోతుంది. కాగా ఇదే లైను నాకు తగిలిం,ఇ నేను ప్రియుడితో దుబాయ్ పారిపోయాను అంటూ వార్తలు పుట్టించారు.ఇక అప్పుడే ఆ వార్తలకు చెక్ పెట్టాను. నిజానికి నేను వెళ్ళింది బాయ్ ఫ్రెండ్ తో కాదు నా ఫ్యామిలీతో. 

అయినా కూడా  మా ఫ్యామిలీ కి సంబంధించి ఎప్పుడు కూడా ఏవో రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఇక సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల్లో కొందరు చనిపోయినట్టుగా వీడియోస్ కూడా పెడుతున్నారు. ఇకపోతే వాటితో పోల్చుకుంటే నా విషయంలో వచ్చిన రూమర్ చాలా చిన్నది. అయినా ఆ రూమర్ తర్వాత నేను మరింత స్ట్రాంగ్ అయ్యాను` అంటూ హీరో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ చెప్పుకొచ్చింది. పెళ్లి గురించి మాట్లాడుతూ.. తన పెళ్ళికి ఇంకా తొందర ఏమీ లేదని, ప్రస్తుతం కెరీర్ పై మాత్రమే దృష్టి పెట్టానని తెలిపింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: