ఈమధ్య భాషతో సంబంధం లేకుండా ఇతర భాష సినిమాలు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన విజయాలను అందుకుంటున్నాయి. అలాగే అద్భుతమైన కలెక్షన్ లను కూడా సాధిస్తున్నాయి. దానితో చాలా మంది ప్రొడ్యూసర్ లు ఇతర భాషలో విడుదల సూపర్ సక్సెస్ సాధించిన సినిమాలను రీమేక్ చేయకుండా డైరెక్ట్ గా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా నవంబర్ 4 వ తేదీన తమిళ భాషలో విడుదల అయిన లవ్ టుడే మూవీ తమిళ ప్రేక్షకులను ఎంత గానో అలరించి , బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ఈ మూవీ లో ప్రదీప్ రంగనాథన్ హీరో గా నటించాడు. అలాగే ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. తాజాగా ఈ మూవీ ని తెలుగు లో దిల్ రాజు విడుదల చేశాడు. నవంబర్ 25 వ తేదీన ఈ మూవీ ను తెలుగు లో కూడా విడుదల చేశారు. తెలుగు లో కూడా ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. ప్రస్తుతం ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సమయం లోనే ఈ మూవీ కి సంబంధించిన "ఓ టి టి" విడుదల తేదీ వచ్చేసింది. ఈ మూవీ "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అలాగే ఈ సంస్థ ఈ మూవీ విడుదల తేదీని కూడా తాజాగా అధికారికంగా ప్రకటించింది. నెట్ ప్లిస్ "ఓ టి టి" సంస్థ లవ్ టుడే మూవీ డిసెంబర్ 2 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి థియేటర్ లలో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: