గత కొన్ని రోజుల నుంచి రెబల్ స్టార్ ప్రభాస్.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రేమించుకుంటున్నారని.. త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు తగ్గట్టుగా ఆధారాలు కూడా దొరకడంతో నెటిజన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు అభిమానులు కూడా త్వరలోనే వీరిద్దరి వివాహం చేసుకుంటారు. నిజానికి వీరిద్దరూ ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నప్పటినుంచి వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సినిమా కి సంబంధించి టీజర్ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ పై ప్రభాస్ కి చెమట వచ్చినప్పుడు దానిని తుడుచుకోవడానికి కృత్తిసనన్ తన చీర కొంగును ఇవ్వడం చూసి ప్రతి ఒక్కరూ వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని అనుకున్నారు.


నిన్నటికి నిన్న వరుణ్ ధావన్,  కృతిసనన్ నటించిన తోడేలు సినిమా రిలీజ్ కాగా.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కరణ్ జోహార్ కార్యక్రమానికి హాజరైన వరుణ్ ధావన్ కూడా కృతి పేరు ఇప్పుడు నా దగ్గర లేదు.. వేరొకరి మనసులో ఉంది.. అతడు ఇప్పుడు ముంబైలో లేడు.  దీపికా పదుకొనేతో సినిమా చేస్తున్నాడు అంటూ పరోక్షంగా కామెంట్లు చేశారు . దీంతో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని మరింత స్పష్టమైంది. కానీ ఈ వార్తలపై కృతి సనన్ స్పందిస్తూ " వరుణ్ ధావన్ సరదాగా మా ఇద్దరి మధ్య ప్రేమ ఉందని చెప్పారు. కానీ అలాంటిదేమీ లేదు. కేవలం మేము స్నేహితులం మాత్రమే.  దయచేసి తప్పుడు ప్రచారాలను చేయకండి" అంటూ క్లారిటీ ఇచ్చింది.

అయితే నిన్నటితో ఈ వార్తలకు పుల్ స్టాప్ పడుతుందని అందరూ అనుకున్నా..  నేటిజెన్లు మాత్రం ఇంకా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని , పెళ్ళి ప్రకటన కూడా చేస్తారు అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కారణం ప్రభాస్ కి  చెమట వచ్చినప్పుడు తుడుచుకోవడానికి తన చీర కొంగును ఇచ్చింది కదా దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అందుకే వీరిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారు.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని త్వరలోనే రివీల్ చేస్తారు అంటూ ఆత్రుతగా నెటిజన్లు ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: