తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా ప్రదీప్ రంగనాథన్ "లవ్ టుడే" అనే మూవీ లో హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. తమిళ భాషలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 4 వ తేదీన భారీ అంచనాల నడుమ తమిళ భాషలో విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా తమిళ్ లో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న లవ్ టుడే మూవీ ని ఇదే పేరుతో తెలుగు లో కొన్ని రోజుల క్రితమే విడుదల చేశారు.

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా లవ్ టుడే మూవీ మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రదీప్ రంగనాథన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రదీప్ రంగనాథన్ ...  లవ్ టుడే మూవీ కి ఈ టైటిల్ ను పెట్టే ప్రాసెస్ లో నేను దాన్ని క్రియేట్ చేసిన ఒక వ్యక్తికి నేను థాంక్స్ చెప్పడం మర్చిపోయాను. వారు 1997 సంవత్సరం లోనే ఈ లవ్ టుడే అనే టైటిల్ ని క్రియేట్ చేసిన దర్శకుడు బాల శేఖరన్ గారు.  ఇలాంటి ఓ టైటిల్ ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాని ప్రదీప్ రంగనాథన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే లవ్ టుడే మూవీ రేపటి నుండి అనగా డిసెంబర్ 2 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: