తమిళ సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న అజిత్ ప్రస్తుతం తునివు అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. హెచ్ వినోద్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ మూవీ ని బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ మూవీ విడుదల తేదీని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 11 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థ్రియేటికల్ హక్కులను ఈ మూవీ యూనిట్ అమ్మి వేసింది.

మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థ్రియేటికల్ హక్కులను కేవలం మూడు కోట్ల రూపాయలకే ఈ మూవీ యూనిట్ అమ్మినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ మూవీ కనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ ను తెచ్చుకున్నట్లు అయితే అద్భుతమైన లాభాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఈ మూవీ ని తెలుగు లో "తెగింపు" అనే పేరుతో విడుదల చేయడానికి మూవీ యూనిట్స్ సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ టైటిల్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లో రాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ నుండి మొదటి పాటను డిసెంబర్ 9 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా చిత్ర బృందం ఇప్పటికే చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: