
అప్పుడు మాములు టైం కన్నా తెలుగు సినిమాల మధ్య పోటీ గా వచ్చి ఓదినందుకు ఓ రేంజ్ లో ఆడుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీర సిం హా రెడ్డి రెండు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల మధ్య వారసుడు వస్తున్నాడు. అంచనాలను తగినట్టుగా సినిమా ఉంటే ఓకే లేదంటే మాత్రం ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ విజయ్ ను ఆడేసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పొంగల్ రేసులో విజయ్ వారసుడు అని అంటుంటేనే మెగా నందమూరి ఫ్యాన్స్ ఒప్పుకోవట్లేదు.
మరి ఆ రెండు సినిమాల మధ్య పోటీగా రిలీజై వారసుడు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. విజయ్ సినిమా అంటే తెలుగులో కూడా మినిమం గ్యారెంటీ ఉంటుంది. అయితే మరీ అరవ ఫ్లేవర్ ఎక్కువైతే మాత్రం మన ఆడియన్స్ పెదవి విరుస్తారు. అందుకే వారసుడు అటు తమిళం, ఇటు తెలుగు రెండినీ బ్యాలెన్స్ చేస్తూ పూర్తి చేశారట. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా క్రేజీ గా ఉండబోతున్నాయని చెప్పొచ్చు.