
ఇదిలా ఉండగా మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడంతో రెండవ భాగాన్ని ఎప్పుడు విడుదల చేస్తారని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ 2 సినిమా షూటింగు ఇప్పటికే ప్రారంభమై షెడ్యూల్ చివరి దశకు చేరుకుంది. ఇక మొన్నటి వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న చిత్ర బృందం ఇప్పుడు ప్యాచ్ వర్క్ షూట్ జరగబోతోంది. జనవరి 5 నుంచి జనవరి 10 వరకు షెడ్యూల్ చేయబడింది.
ప్రస్తుతం ఎలాగో సంక్రాంతి పండుగకు పెద్ద సినిమాలు పోటీపడుతున్న నేపథ్యంలో ఈ సినిమాను సంక్రాంతి తర్వాత విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి అయితే ఇందులో నటించిన ఐశ్వర్యరాయ్, త్రిష లకు మంచి గుర్తింపు లభించింది. అంతేకాదు ఇరువురికి అటు టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా అవకాశాలు లభిస్తున్నాయి. మొత్తంగా చెప్పాలి అంటే చాలా మంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఈ సినిమా ద్వారానే మళ్లీ ఫామ్ లోకి వచ్చారని చెప్పవచ్చు.