తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటు వంటి సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో పేపర్ బాయ్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఆ తరువాత ఏక్ మినీ కథ మూవీ తో ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన మంచి రోజులు వచ్చాయి మూవీ లో సంతోష్ శోబన్ హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించలేక పోయింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే సంతోష్ శోభన్ "లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్" అనే మూవీ లో హీరో గా నటించాడు.

మేర్లపాక గాంధీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో పొడుగు కాళ్ళ సుందరి ఫారియ అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మామూలు విజయం సాధించిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి సోనీ లీవ్ "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది. ఈ మూవీ ఈ రోజు నుండి అనగా డిసెంబర్ 9 వ తేదీ నుండి తెలుగు భాషలో సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: