మెగాస్టార్ చిరంజీవి ఇంకా డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా వాల్తేరు వీరయ్య. అటు మెగా అభిమానులకు ఇంకా ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు రెడీగా ఉంది.ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌ లో ప్రొడక్షన్ పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుందని మేకర్స్ గురువారం నాడు అధికారికంగా ప్రకటించారు.ఎన్నో కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా అలాగే.. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.తాజాగా మెగా, మాస్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ని ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుంచి రవితేజ మాస్ ట్రీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. 


సినిమా నుంచి రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ డిసెంబర్ 12 వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ చేసిన ప్రీ లుక్ సాలిడ్ గా ఉందనే చెప్పాలి. ఓ చేతిలో మేక పిల్ల ఇంకా మరో చేతిలో గొడ్డలితో గ్యాస్ సిలిండర్ ను లాక్కొస్తున్న స్టిన్నింగ్ విజువల్ రివీల్ చేయడం జరిగింది. ఇక దీంతో ఈ చిత్రంలో రవితేజ లుక్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో చూస్తే తెలుస్తోంది.ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ ని అందిస్తున్నారు. ఇక మరోవైపు.. ఈ సినిమాలో రెండు పాటల షూటింగ్ కోసం మెగాస్టార్ చిరంజీవి ఇంకా హీరోయిన్ శ్రుతి హాసన్ తో పాటు చిత్ర యూనిట్ యూరప్ ని వెళ్ళింది. అక్కడ వండర్ ఫుల్ లోకేషన్స్ లో రెండు పాటలని షూట్ చెయ్యనున్నారు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య ఫస్ట్ సాంగ్ 'బాస్ పార్టీ'.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా మారి దుమ్ము రేపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: