ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఆర్జీవి పేరు బలంగా వినిపిస్తోంది.. ఎవ్వరికీ అర్థం కానీ ఓ మిస్టరీ. ఈయన వ్యవహారశైలి ఎప్పుడూ వివాదాస్పదమే. అయితే తన రాతలపై, మాటలపై ఎవరైనా ప్రశ్నిస్తే.. మోనార్క్ మాదిరిగా సమాధానాలు ఇస్తారు. తన ప్రమోషన్ కోసం ఏది పడితే అది మాట్లాడటం.. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ వీడియోలు చేయడాన్ని ఎప్పుడూ సమర్థించుకునే ఆర్జీవీ.. తాజాగా ఆషూ రెడ్డితో మితిమీరి ప్రవర్తించిన ఇంటర్వ్యూపై కూడా అదే పని చేశారు. ఆషు రెడ్డి కాలి బొటన వేలుని నాకడం నా ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల తన “డేంజరస్”ప్రమోషన్ లో భాగంగా ఆషురెడ్డితో ఓ ఇంటర్య్యూ చేసిన ఆర్జీవీ… ఆ ఇంటర్య్వూ చివర్లో ఆమె పాదాలకు ముద్దు పెట్టుకున్నారు.


కేవలం ముద్దు పెట్టుకోవడమే కాదు.. కాస్త అసభ్యకరంగా ఆమె కాలి వేళ్లను.. నోట్లో పెట్టుకున్నారు..ఇక ఆ పనితో ఎప్పటిలాగే నెట్టింట వైరల్ అయ్యారు. అందరూ తనను దుమ్మెత్తి పోసేలా చేసుకున్నారు. ఇక ఈ కమ్రంలోనే తన చేసిన పనిని సమర్థించుకుంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఆర్జీవీ. ఆషురెడ్డితో తాను మాట్లాడిన మాటలు, చేసిన పనులు అన్నీ తమ వ్యక్తిగతం అని చెప్పారు ఆర్జీవీ.నిజం అనేది పర్సనల్ కమ్యూనికేషన్ ఫ్లాట్ ఫామ్ అని అందులో తాను పెట్టిన పోస్ట్‌లు, వీడియోలు నచ్చకపోతే చూడాల్సిన అవసరం లేదన్నారు..


ఎవరు ఎన్ని చెప్పినా తనకు నచ్చిందే మాట్లాడతానని, తనకు నచ్చిందే చేస్తాను మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. చెప్పడమే కాదు.. ఇది కంటిన్యూ అవుతుందని ఈ సారి కాస్త గట్టిగా చెప్పారు. ఇక వీడియో చివర్లో ‘నా చావు నేను చస్తా, మీ చావు మీరు చావండి’ అంటూ ముగించారు.. ఇక ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. ఏది ఏమైనా ఈ యవ్వారం దుమారం రేపింది.. ఇక ఇప్పుడు ఆయన సమాధానం ఎలా మారుతుందో చూడాలి..ఆయన ఇప్పుడు సినిమాల కన్నా కూడా ఇలా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నాడు...


మరింత సమాచారం తెలుసుకోండి:

Rgv