తెలుగు మరియు తమిళ భాషలలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ గురించి మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు విశాల్ సినిమా విడుదలవుతుంది అంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ దద్దరిలేవి అని చెప్పాలి .పందెంకోడి, పొగరు, భరణి,డిటెక్టివ్, అభిమన్యుడు ఇలా తెలుగులో డబ్ అయిన విశాల్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఆయనకి సరైన హిట్ లేకపోవడంతో అభిమన్యుడు సినిమా తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమా డిజాస్టర్లు గా మిగిలాయి. హీరోగా ఆయన నటించిన లేటెస్ట్ సినిమా లాఠీ ప్రస్తుతం విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

విశాల్ రీసెంట్ గా తనకి వచ్చిన క్రేజీ ఆఫర్ ను వదులుకున్నాడు అని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి. అయితే తమిళ స్టార్ హీరో విజయ్ మరియు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో మాస్టర్ తర్వాత మరో సినిమా తెరకెక్కనుంది. ఇక విక్రం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో విలన్ రోల్ కోసం విశాల్ ని సంప్రదించారట. ఇక తన సినిమాలో విల్లన్స్ని లోకేష్ ఎంత పవర్ఫుల్ గా చూపిస్తాడో మనందరికీ తెలిసిందే. అయితే మాస్టర్ మరియు విక్రమ్ సినిమాలలో విజయ్ సేతుపతిని ఎంత పవర్ఫుల్గా చూపించాడో మనకి తెలిసిందే.

ఒక విధంగా చెప్పాలి అంటే హీరోని కూడా డామినేట్ చేసేలా విలన్ పాత్రలు ఉంటాయి. విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో స్టార్ హీరో సూర్యా ని రోలెక్స్ అని నెగిటివ్ పాత్రలో చూపించాడు లోకేష్ .ఇక అలాంటి డైరెక్టర్ సినిమాలో విలన్ రోల్ మిస్ అవ్వడం అంటే గోల్డెన్ ఛాన్స్ ని చేతులారా వదులుకున్నట్టే. దీనిపై విశాల్ ఇటీవల క్లారిటీ ఇచ్చాడు. అయితే వరుసగా సినిమాలకు కమిట్మెంట్ ఇవ్వడం వల్లే నేను ఈ సినిమా వదులుకున్నానని... కానీ భవిష్యత్తులో ఇలాంటి ఆఫర్ కనుక మళ్ళీ వస్తే నో చెప్పను అని.. నాకు విజయ్ గారిని డైరెక్టర్ చేయాలని ఉంది.. నా దగ్గర ఆయన కోసం ఒక మంచి స్టోరీ సిద్ధంగా ఉంది.. ఆయన ఒప్పుకుంటే ఆయనతో ఆ సినిమా చేస్తా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: