‘బిగ్ బాస్ సీజన్ 6’ ముగింపు దశకు చేరుకుంటోంది రాబోతున్న ఆదివారం ఈ సీజన్ విజేత ఎవ్వరు అన్న విషయం ప్రకటించబోతున్నారు. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ సీజన్ మిగతా సీజన్ లతో పోల్చుకుంటే కొంచం పేలవంగా ఉంది అన్న కామెంట్స్ వచ్చినప్పటికీ ఈ సీజన్ ముగింపు మాత్రం ఎవరు ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతోంది అన్న లీకులు వస్తున్నాయి.


లీక్ అవుతున్న సమాచారంమేరకు ఈరోజు బుధవారం జరిగే షోలో ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అని అంటున్నారు. కీర్తి లేదా శ్రీసత్య వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయం అన్న లీకులు వస్తున్నాయి. ఆతరువాత వచ్చే ఆదివారం జరగబోతున్న ఫైనల్ కు టాప్ 5 మిగలడంతో వీరిమధ్య పోటీ విపరీతమైన ఆశక్తిని కలిగించే ఆస్కారం ఉంది.


అయితే ఈ టాప్ 5 లో కామెన్ మ్యాన్ గా ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి స్థానం సంపాదించుకోవడమే కాకుండా ఈ సీజన్ విజేత అతడే అయినా ఆశ్చర్యంలేదు అన్న లీకులు వస్తున్నాయి. దీనికి కారణం ‘బిగ్ బాస్’ షోకు ఓట్లు వేసే సాధారణ వ్యక్తులు తమ ప్రతినిధిగా ఆదిరెడ్డి ని భావించుకుని అతడికి పెద్ద సంఖ్యలో ఓట్లు వేస్తున్నట్లు సమాచారం. ఈషోలో ఎంటర్ అయినదగ్గర నుండి ఆదిరెడ్డి చాల తెలివిగా గేమ్ ఆడుతున్నాడు అన్న అభిప్రాయంలో ‘బిగ్ బాస్’ ఓటర్లు ఉన్నట్లు టాక్.


యూట్యూబ్ లో బిగ్ బాస్ రియాలిటీ షోల పై రివ్యూలు చేయడమే కాకుండా మంచి సినిమాల గురించి అదేవిధంగా సామాజిక విషయాల గురించి తన యూట్యూబ్ ఛానల్ లో మంచి కామెంట్స్ చేసే ఆదిరెడ్డికి యూట్యూబర్ గా లక్షల సంఖ్యలో ఫాలోయింగ్ ఉంది. బుల్లితెర నటుడుగా రోహిత్ పాపులర్ సింగర్ గా రేవంత్ లవర్ గా శ్రీహాన్ లకు కామెన్ మ్యాన్ కేటగిరిలో ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి గట్టిపోటీ ఇస్తున్నాడని వార్తలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: