మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి రష్మిక మందన గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ మూవీ ల ద్వారా మంచి గుర్తింపుని తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తెలుగు ఇండస్ట్రీ తో పాటు తమిళ , బాలీవుడ్ ఇండస్ట్రీ లపై కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ క్రేజీ మూవీ వారీసు లో తలపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు.

మూవీ కనుక సూపర్ సక్సెస్ అయినట్లు అయితే ఈ ముద్దు గుమ్మ కు తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన బాలీవుడ్ ఇండస్ట్రీ పై కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక మూవీ లలో నటిస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ మిషన్ మజ్ను అనే మూవీ లో కూడా హీరోయిన్ గ నటించింది. సిద్ధార్థ్ మల్హోత్రా ఈ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని గతంలో చాలా సార్లు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించినప్పటికీ అనేక సార్లు ఈ మూవీ విడుదల వాయిదా పడింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ని జనవరి 20 వ తేదీన నేరుగా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ ద్వారా రష్మిక మందన బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: