తమ అభిమాన నటుని గురించి వచ్చే ప్రతి విషయాన్నీ బాగా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది తమ అభిమాన నటున్ని ఫాలో అవుతూ ఉంటారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఒకప్పుడు ఎంత తీసుకున్నాడో ఏమో గానీ ఇప్పుడు పవన్ తో సినిమా చేయాలంటే నిర్మాతకు 50 కోట్లు అయితే ఇవ్వక తప్పని స్థితి.

కానీ ఇదే పవన్‌తో తొలి సినిమా అల్లు అరవింద్ చాలా తక్కువ పారితోషికం అందించాడట. అప్పట్లో పవన్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి చిరంజీవి తీసుకున్న జాగ్రత్తలు మాత్రం ఎన్నో..? సోదరుడిని పర్ఫెక్ట్‌గా లాంఛ్ చేయడానికి చాలా మంది దర్శకులను చెక్ చేసుకున్న తర్వాత చివరికి ఈవీవీ సత్యనారాయణ నే సూటయ్యాడు. అప్పటికే హిందీలో వచ్చి హిట్టైన ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాను తెలుగులో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ఈవీవీ మార్చి రీమేక్ చేసాడని తెలుస్తుంది.

ఆ తర్వాత ఖుషీ వరకు వరస విజయాలతో పవర్ స్టార్ టాప్ హీరో అయ్యాడు. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా ఆయన దుమ్ము దులిపేస్తున్నాడు. తొలి సినిమాలో హీరోయిన్‌గా కూడా అక్కినేని వారమ్మాయి సుప్రియను తీసుకుని మెగా, అక్కినేని కుటుంబాల అభిమానులను ఈవీవీ ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు . పవన్ పోస్టర్ డిజైన్స్ నుంచి ప్రమోషన్స్ కూడా ఈవీవీ చాలా కొత్తగా అయితే చేసాడు.

ఆ రోజుల్లోనే ఈయన చేసిన ప్రమోషన్స్ చూసి అంతా కూడా షాక్ అయ్యారు. ముందుగా పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోలతో ఈ అబ్బాయి ఎవరు అంటూ వాల్ పోస్టర్స్ అంటించారు. సినిమా విడుదలకు ముందు ఇతడే మన కళ్యాణ్ అంటూ మరో పోస్టర్స్ రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల్లో కూడా తెగ ఆతృత వచ్చేసింది. దానికి తోడు చిరంజీవి తమ్ముడు అంట అంటూ అంచనాలు సరేసరి.

అలా వచ్చింది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా మొదట్లో కూడా ఇతడే మనకు కావాల్సిన కళ్యాణ్ బాబూ అంటూ వేసాడట దర్శకుడు ఈవీవీ. ఇలా ప్రతీ విషయంలోనూ పవన్‌ను అద్భుతంగా ప్రమోట్ చేసాడు. ఇక ఇందులో పవన్ చేసిన రియల్ ఫీట్స్ కూడా సినిమాకు అయితే అదనపు ఆకర్షణ. ఈ సినిమాలో అప్పటి స్టార్ హీరోయిన్ రంభ కూడా ఓ ఐటం సాంగ్ చేసింది.

ఇండస్ట్రీలోని ప్రముఖ నటులు, కమెడియన్స్ అంతా కూడా ఈ సినిమాలో నటించారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి యావరేజ్ అయినా కూడా పవన్ కెరీర్‌కు మంచి పునాది పడింది. అయితే ఈ మూవీకి పవన్ తీసుకున్న పారితోషికం కూడా చాలా తక్కువ. సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు నెలకు 5 వేల రూపాయలు వంతున నిర్మాత అల్లు అరవింద్ అయితే ఇచ్చాడు.

పైగా అప్పటికి పవన్ ఎవరికీ తెలియదు. దాంతో తొలి సినిమాకు చాలా తక్కువ పారితోషికమే తీసుకున్నాడు. అదే ఇప్పుడు పవన్‌తో సినిమా చేయాలంటే కనీసం 50 కోట్లు ఇవ్వాల్సిందే. 5 వేలతో మొదలై 50 కోట్లకు తన రేంజ్ పెంచుకున్నారు పవన్.

మరింత సమాచారం తెలుసుకోండి: