క్రిస్మస్ రేస్ ను టార్గెట్ చేస్తూ విడుదలకాబోతున్న ‘ధమాక’ మూవీపై అంచనాలు బాగా ఉన్నాయి. చాలాకాలం తరువాత రవితేజా నుండి రాబోతున్న పూర్తి మాస్ మసాలా సినిమా ‘థమాక’ అన్నఅంచనాలు వస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించిన ట్రైలర్ అదేవిధంగా ఈమూవీలోని పాటలు కూడ బాగా ప్రేక్షకులకు నచ్చడంతో ఈమూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్న ప్రచారం ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతోంది.


దీనికితోడు ఈమూవీలో క్రేజీ బ్యూటీ శ్రీలీల ఉండటం మరొక ప్లస్ పాయింట్ గా మారింది. అయితే ఇప్పుడు ఈసినిమాకు సంబంధించిన లేటెస్ట్ ట్రైలర్ ను అదేవిధంగా విశ్వక్ సేన్ నటిస్తున్న ‘ధంకీ’ మూవీ ట్రైలర్ ను సరిపోలుస్తూ కొందరు ఈ రెండు సినిమాలు ఒకే కథతో తీసారా అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.


దీనికి కారణం ‘ధమాక’ మూవీలో రవితేజ ధనవంతుడుగా అదేవిధంగా పేదవాడుగా కనిపిస్తాడు. ‘ధంకీ’ మూవీలో కూడ విశ్వక్ సేన్ ధనవంతుడుగా అదేవిధంగా పేదవాడుగా కనిపిస్తాడట. ఈ రెండు సినిమాలలోని ధనవంతుడు పాత్రలు చాల పోగరుబోతుగా ఎవర్ని పట్టించుకోని వ్యక్తిత్వంగల వ్యక్తులుగా తీర్చిదిద్దారు. ఈ రెండు సినిమాలలోను హీరోయిన్స్ తాము ప్రేమిస్తున్నది పేదవాడిన లేదా ధనతుడున తెలియక కన్ఫ్యూజ్ లో ఉంటారట. ఇలాంటి స్టోరీ లైన్ తో గతంలో చాల సినిమాలు వచ్చాయి.


మెగా స్టార్ చిరంజీవి కూడ ఇలాంటి కథలు ఉన్న సినిమాలలో నటించాడు. ఇక ‘ధమాక’ ‘ధంకీ’ సినిమాలకు కథ అందించింది ఒకే రచయిత అవ్వడంతో ఈ రెండు సినిమాలు ఒకలానే ఉంటాయ అంటూ సందేహాలు మొదలయ్యాయి. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్. ఈ రెండు సినిమాలకు కథ అందించడంతో ఈ రెండు సినిమాలలో ఏసినిమా మరో సినిమాకు కాపీ అంటూ సోషల్ మీడియాలో జోక్స్ పెలుతున్నాయి. ‘ధమాక’ ఇక్కడ క్రిస్మస్ కు విడుదల అవుతుంటే ‘ధంకీ’ మార్చి నెలలో విడుదల అవుతున్న నేపధ్యంలో నిజంగా ఒకే కథ అయితే విశ్వక్ సేన్ కు నష్టం అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: