టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందిన పూరి జగన్నాథ్ చాలా గ్యాప్ ఇచ్చి తీసిన టైగర్ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదల అయింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినప్పటికీ ఫ్లాప్ అవడంతో వారి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో పూరి జగన్నాథ్ పై అనేకమైన విమర్శలు కూడా రావడం జరిగింది. ఇక ఆ పరాజయం నుండి కోలుకొని ఆయన తదుపరి ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు పూరి జగన్నాథ్. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు 

పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమాని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో తీయాలని అనుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక సల్మాన్ తో  పనిచేసేందుకు పూరి జగన్నాథ్ ఎంతో ఆసక్తిగా ఉన్నారట. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ కు పూరి జగన్నాథ్ కథను వినిపించారని సల్మాన్ కూడా దీనికి ఓకే చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇంతవరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ విషయం తెలిసిన వీరి అభిమానులు సల్మాన్ ఖాన్ తో పూరి జగన్నాథ్ తీయబోయే సినిమాపై ఎన్నో ఆశలను పెట్టుకున్నారు. ఇక పూరి  దర్శకత్వంలో పనిచేయాలని సల్మాన్ ఖాన్ చాలా కాలంగా అనుకొంటున్నారని

 అప్పట్లో వచ్చిన వాంటెడ్ సినిమా అప్పటినుండి పూరి జగన్నాథ్ తో సల్మాన్ ఖాన్ నటించిన ఎంతో ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో పూరి కథలపై సల్మాన్ ఖాన్ ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన సల్మాన్ ఖాన్ తో పాటు పూరి జగన్నాథ్ అతిధి పాత్రలో కనిపించడం వారి అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇప్పుడు పూరి జగన్నాథ్ లైగర్ సినిమా ఫ్లాప్ తో సల్మాన్ కోసం అదిరిపోయే స్టోరీని సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక 125 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకిక్కిన లైగర్ సినిమాలో అమెరికన్ బాక్సర్ మైక్ టైసన్ అతిథి పాత్రలో మెరిసిన సంగతి మనందరికీ తెలిసిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: