
తమిళ తెలుగు భాషల్లో జనవరి 12న ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ కోసం దిల్ రాజు భారీ స్థాయిలో థియేటర్లని రెడీ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం ఇక్కడ ప్రమోషన్స్ చేయకపోవడం విజయ్ అభిమానులను నిరాశపరుస్తుంది. సంక్రాంతికి రాబోతున్న సినిమాలు మంచి ప్రమోషన్స్ చేస్తున్నాయి. తెలుగు సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న `వీర సింహారెడ్డి` చిరంజీవి నటిస్తున్న `వాల్తేరు వీరయ్య` సినిమాలు ఈ సంక్రాంతికే రిలీజ్ కానున్నాయి.
ఆ సినిమాలకు భారీ స్థాయి లో ప్రొమొతిఒన్స్ రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పాటలు విడుదల చేసి అందరిని ఆకట్టుకున్నారు కూడా. అయితే ఈ సినిమాలకు మించి భారీ స్థాయిలో `వారసుడు` కోసం థియేటర్లని దిల్ రాజు బ్లాక్ చేశాడట. ఇదే ఇప్పడు వివాదంగా మారింది. అయితే వివాదం ఏమో కానీ ఈ సినిమా కి ప్రమోషన్స్ చేయకపోవడం నిరాశను కలిగిస్తుంది. అయితే సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ మూవీకి భారీ బజ్ అయితే వుంది కానీ ప్రమోషన్స్ మాత్రం ఆ స్థాయిలో లేవంటూ విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారట. మరి ఇది ఈ సినిమా పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. తమిళంలో కూడా ఈ సినిమా కు పెద్దగా బజ్ లేదని తెలుస్తుంది. మరి దిల్ రాజు ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి.