గత రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ తమన్న స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. వరుస సినిమాలు చేస్తూ అప్పట్లో మిల్కీ బ్యూటీ తమన్న స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది. ఇక తమన్నా పాత్రతో సంబంధం లేకుండా అన్ని రకాల పాత్రలలో నటించింది. ఇక తెలుగులోనే కాకుండా మిల్కీ వీటితో పాటు బాలీవుడ్ మరియు కోలీవుడ్ వరకు చాలా సినిమాలలో నటించి సక్సెస్ను అందుకుంది.మూడు పదుల వయసు వచ్చినప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా తనకంటూ ఒక టాగ్ ను క్రియేట్ చేసుకుంది మిల్కీ బ్యూటీ తమన్న. 

అయితే తాజాగా ఈమె పుట్టినరోజు వేడుక సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.  ఆ ఇంటర్వ్యూలో భాగంగా తనకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అయితే తమన్నా తను ముంబైలో ప్లస్ టు చదువుకుంటున్న సమయంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చానని చెప్పుకొచ్చింది. ఇక అప్పుడు తన వయసు కేవలం 15 ఏళ్లు అట. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం మొదటిగా సాంద్ సా రోషన్ షహనా అనే సినిమాలో నటించిన తర్వాత అదే సమయంలో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి శ్రీ అనే సినిమాలో నటించిన తమన్నా ఆమె నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఇక నా పని అయిపోయింది

 నేను మళ్ళీ ముంబై వెళ్ళిపోవాలి అనుకున్న సమయంలో నాకు ఒక గోల్డెన్ ఆఫర్ వచ్చింది. అదే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీడేస్ సినిమాలో నటించే అవకాశం నాకు మళ్ళీ వచ్చింది అంటూ పేర్కొంది తమన్నా. ఇక ఆ సినిమాలో నేను నటించిన అనంతరం ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమా అనంతరం నాకు వరుస ఆఫర్లు కూడా వచ్చాయి అంటూ చెప్పవచ్చింది తమన్నా. ఇక అలా తెలుగుతోపాటు తమిళం లో కూడా కొన్ని సినిమాలలో నటించి అక్కడ కూడా మంచి గుర్తింపును పొందాను అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. అనంతరం సినిమాలే కాకుండా ఐటమ్ సాంగ్లలో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకున్నాను అంటూ తన సినీ కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది తమన్నా ...!!

మరింత సమాచారం తెలుసుకోండి: