ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా స్టార్ కమెడియన్గా మంచి గుర్తింపు పొందిన రాంప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుడిగాలి సుదీర్ టీం మెంబెర్ గా కొనసాగిన ఈయన ఇప్పుడు స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందాడు. ఇక గెటప్ శ్రీను, రాంప్రసాద్, సుధీర్కామెడీ టైమింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన వేసే పంచ్ డైలాగ్ లతో ఎప్పుడు అలరిస్తూనే ఉంటాడు.ఆయన వేసే పంచ్ డైలాగ్ లు  తట్టుకోలేక ఆయనకి ఆటో రాంప్రసాద్ అనే పేరును సైతం పెట్టడం జరిగింది. జబర్దస్త్ పుణ్యమా అని ఈయన ప్రస్తుతం సినిమాల్లో కూడా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నాడు. 

ఇదిలా ఉంటే ఇప్పుడు రాంప్రసాద్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈయన... ఆయన తలను ఒక కవర్  కట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో చాలామంది రాంప్రసాద్ ఏదో  అనారోగ్యానికి గురయ్యాడని అనుకుంటున్నారు.అందుకుగాను తలకి ఆ మాస్క్ పెట్టుకున్నాడని భావిస్తున్నారు. ఇటీవల ఆయన ప్రాణ స్నేహితుడైన సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన గాలుడు సినిమా విడుదలైంది. ఇక వీటికి సంబంధించిన కార్యక్రమానికి జబర్దస్త్ మిత్రులందరికీ హాజరయ్యారు.

కానీ రాంప్రసాద్ మాత్రం ఆ ఈవెంట్ కి రాలేదు. ఫోన్లోనే సుడిగాలి సుధీర్ తో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. సుడిగాలి సుదీర్ సినిమా కార్యక్రమానికి కూడా ఈయన రాకపోవడంతో అసలు రాంప్రసాద్ కి ఏమైంది అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాంప్రసాద్ కి ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు. తాజాగా ఆయన హెయిర్ ట్రాన్స్ప్లెంటేషన్ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకుగాను ఆయన తలకి మాస్క్ వేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇదే దానికి కారణం అని మరే కారణాలు లేవని ఆయన ఆరోగ్యం చాలా బాగుందని సమాచారం. ఇక ఈ వార్త తెలిసిన అనంతరం ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: