తమిళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి విష్ణు విశాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న విష్ణు విశాల్ కొంత కాలం క్రితం ఎఫ్ ఐ ఆర్ అనే మూవీ తో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించాడు. రవితేజ ఈ మూవీని తెలుగులో రవితేజ సమర్పించగా ... మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది.

మూవీ ద్వారా విష్ణు విశాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో ఘట్టా కుస్తీ అనే తమిళ మూవీలో హీరోగా నటించాడు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి చెల్ల అయ్యవు దర్శకత్వం వహించగా ... రవితేజ ... విష్ణు విశాల్ ... శుభ్ర ఈ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ ని తెలుగు లో మట్టి కుస్తీ అనే పేరుతో విడుదల చేశారు. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది.

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ రోజు నుండి ఈ సినిమాను తమిళ్ మరియు తెలుగు భాషలో స్ట్రీమింగ్ చేస్తోంది. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రస్తుతం ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: